
ఒక్కసారిగా ఇండియన్ సినిమా మొత్తం తెలుగు చిత్ర సీమవైపు, అలాగే టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పై ప్రశంశల జల్లు కురిపించిన సినిమా ‘బాహుబలి’. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో వచ్చిన మొట్ట మొదటి స్టీరియోస్కోపిక్ పీరియడ్ ఫిల్మ్ బాహుబలి. తెలుగు వారంతా కాలర్ ఎగరేసుకునేలా చేసిన ‘బాహుబలి’ సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఓవరాల్ గా 600కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి ఇండియా వ్యాప్తంగా రికార్డ్ ని సృష్టించింది. రికార్డ్ అనే విషయాన్ని పక్కద పెడితే బాహుబలి ఫస్ట్ పార్ట్ కి ముగింపుగా రానున్న ‘బాహుబలి – ది కంక్లూజన్’పై అంచనాలు ఎవరూ అందుకోలేని విధంగా పెరిగిపోయాయి.
అందులో భాగంగానే రాజమౌళి ఇప్పటికే బాహుబలి సెకండ్ పార్ట్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడని తెలియజేశాం. బాహుబలి సీక్వెల్ పై పెరిగిపోయిన అంచనాల మేరకు రాజమౌళి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి బాహుబలి పార్ట్ 2 లో ఒక గంట పాటు వచ్చే వార్ ఎపిసోడ్ ని పూర్తిగా రీ డిజైన్ చేస్తున్నాడు. దానికి కారణం ఫస్ట్ పార్ట్ కి మించిన వార్ సీక్వెన్స్ లని సెకండ్ పార్ట్ లో ఆశిస్తారు. అందుకే రాజమౌళి ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఆ వార్ ఎపిసోడ్ ని ఫస్ట్ పార్ట్ కంటే భారీగా డిజైన్ చేస్తున్నాడు. బాహుబలి 2 స్క్రిప్ట్ లో కూడా చిన్న చిన్న మార్పులు చేయనున్నారు. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తైన సెకండ్ పార్ట్ ని పూర్తి చేయడం కోసం ఇంకా 120 రోజులపైనే షూటింగ్ చేయాల్సి ఉంది. సెకండ్ పార్ట్ షూట్ అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

