అతిరధ మహారధుల సమక్షంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవం !

అతిరధ మహారధుల సమక్షంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవం !

Published on Nov 11, 2018 12:25 PM IST

ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రారంభోత్సవం ముగిసింది. ఈ ప్రారంభోత్సవానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్క్రిప్ట్ ఎన్టీఆర్ – చరణ్ మరియు రాజమౌళిలకు అందజేశారు. ఎన్టీఆర్ గడ్డంతో లుక్‌ లో కనిపించగా.. రామ్ చరణ్ కూడా లైట్ గా గడ్డంతోనే కనిపించారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ లో వీరి లుక్ లు మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో ఎవరెవరు నటిస్తున్నారు ? ఎన్టీఆర్ – చరణ్ సరసన నటించబోయే హీరోయిన్లు ఎవరు అనే విషయాలను ఇంకా చిత్రబృందం ప్రకటించలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు