‘టెంపర్’ సూపర్ హిట్.. రాజమౌళి కామెంట్

SS-RAJAMOULI
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ‘టెంపర్’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హైదరాబాద్ బ్రమరాంభ థియేటర్లో జరిగిన బెనిఫిట్ షోకు ప్రముఖ దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మలు హాజరయ్యారు. సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్, పూరి టేకింగ్ లపై ప్రసంశల జల్లు కురిపించారు.

తన ట్రేడ్ మార్క్ క్యారేక్టరైజేషన్లు, డైలాగ్స్ తో పాటు స్ట్రాంగ్ స్క్రిప్ట్, సూపర్ క్లైమాక్స్ తో పూరి జగన్నాధ్ గారు ‘టెంపర్’ను అందించారు. తారక్ అద్బుతంగా నటించాడు. పోలీస్ స్టేషన్, ముఖ్యంగా కోర్టు సన్నివేశాలు చాలా కాలం గుర్తుంటాయి. ‘టెంపర్’ టీం అందరికి నా కంగ్రాట్స్.. టైం ఫర్ సెలబ్రేషన్స్.. అని రాజమౌళి సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.

రామ్ గోపాల్ వర్మ, కోన వెంకట్, గోపి మోహన్ తదితర ప్రముఖులు సైతం ‘టెంపర్’ సినిమాపై పాజిటివ్ ట్వీట్ చేశారు. చాలా రోజుల నుండి భారి హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు ఈ విజయంతో సంతోషంగా ఉన్నారు.

Exit mobile version