ఆ హీరోయిన్ పై జక్కన్న సీరియస్

ఆ హీరోయిన్ పై జక్కన్న సీరియస్

Published on Jun 9, 2020 10:17 AM IST

rajamouli11

రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ప్రేక్షకుల మనసులకు నచ్చేలా సినిమా తెరకెక్కించడానికి ఎంత కష్టపడతాడో అదే స్థాయిలో తన సినిమాకు సంబంధించిన ఎటువంటి విషయం కూడా బయటికి రాకుండా పకడ్బందీగా ఉంటాడు. అలాగే తన సినిమాలకు సంబందించిన వర్కింగ్ స్టిల్స్ బయటకి రాకుండా సెట్ లో ఎవరిని మొబైల్ ఫోన్స్ తేవడానికి అనుమతి ఉండదు. ఇక ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా ఆయన అంతే జాగ్రత్తగా ఉంటున్నాడు. ఎటువంటి కీలక సమాచారం బయటికి రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఐతే నటి శ్రీయ చరణ్ అనుకోకుండా ఓ విషయాన్ని బయటపెట్టింది. ఆర్ ఆర్ ఆర్ లో ఆమె నటిస్తున్న విషయంతో పాటు, ప్లాష్ బ్యాక్ సన్నివేశాలలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా కనిపిస్తా అని స్పష్టత ఇచ్చింది. ఈ విషయమే రాజమౌళికి నచ్చలేదట. ఆమె నటిస్తున్న విషయం మాత్రమే కాకుండా ఆమె రోల్ గురించి చెప్పడంతో ఆమెపై ఆయన అసహనంతో ఉన్నదని టాక్. ఇక త్వరలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలుకానుంది.

తాజా వార్తలు