“RRR” లో తారక్ పై మైండ్ బ్లోయింగ్ సీన్.?

“RRR” లో తారక్ పై మైండ్ బ్లోయింగ్ సీన్.?

Published on Apr 12, 2021 6:20 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ వండర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా తారక్ కొమరం భీం పాత్రల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ పాత్రల్లో వీరిని ఎలా చూపించనున్నారో రాజమౌళి ఇది వరకే ప్రొజెక్ట్ చేసారు. నిప్పుకి ప్రతీకగా అల్లూరిని నీరుకి ప్రతీకగా భీం పాత్రను అత్యంత శక్తివంతంగా రాజమౌళి తీర్చిదిద్దుతున్నారు. మరి అలా తారక్ పై మైండ్ బ్లోయింగ్ సీన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.

దీని ప్రకారం రాజమౌళి తారక్ తో ఓ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారట. ఇది పూర్తిగా వేరే లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. అంతే కాకుండా భీం పాత్రకు తగ్గట్టుగా విజువల్ ట్రీట్ లా ఇది ఉంటుందని టాక్. మరి జక్కన ఈ సన్నివేశాన్ని ఏ లెవెల్లో తీస్తున్నారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు