
బాలివుడ్లో రాజమౌళి ఆరంగేట్రం ఖరారు అయ్యింది. ఈ మధ్యనే విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న “ఈగ” హిందీలో అనువాదం కానుంది. ఈ చిత్రం అక్టోబర్ 12న హిందీలో విడుదల కానుంది. ఈ విషయాన్నీ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన సుదీప్ తెలిపారు.ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో జూలై 6న విడుదల అయ్యి భారీ విజయం సాదించింది. అంతే కాకుండా రాజమౌళి కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూడా నిలిచింది. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని నిర్మాతలు సాయి కొర్రపాటి మరియు సురేష్ బాబు హిందీలో అక్టోబర్ 12న విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు.గతంలో ఈ చిత్రాన్ని అక్కడ 3డిలో విడుదల చెయ్యాలని అనుకున్నారు కాని తరువాత ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర అనువాద కార్యక్రమాలు చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటుంది. నాని,సమంత మరియు సుదీప్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.
రాజమౌళి బాలివుడ్ ఆరంగేట్రం ఖరారు
రాజమౌళి బాలివుడ్ ఆరంగేట్రం ఖరారు
Published on Sep 9, 2012 5:28 AM IST
సంబంధిత సమాచారం
- రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..!
- సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్!
- స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!
- వరల్డ్ వైడ్ మాంచి ఓపెనింగ్స్ తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు లోనే లీడ్!
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- విశ్వనాథ్ అండ్ సన్స్ రిపోర్ట్ కార్డ్: నటన, సాంకేతిక వర్గం & ఫైనల్ తీర్పు
- బాబాయ్, అబ్బాయ్ ఒకే నెలలో మొదలు పెట్టనున్నారా?
- క్లాస్ సినిమాతో కూడా దంచికొడుతున్న సూర్య.. భారీ బుకింగ్స్ తో ఆట మొదలు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- అఫీషియల్: ‘జార్జ్ క్రిష్’ గా శర్వా, శ్రీను వైట్ల ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది!

