సూపర్ స్టైలిష్ కాప్ గా రజని, “దర్బార్” మూవీ ఫస్ట్ లుక్

సూపర్ స్టైలిష్ కాప్ గా రజని, “దర్బార్” మూవీ ఫస్ట్ లుక్

Published on Jul 26, 2019 8:00 AM IST

ముంబై లోని ఓ స్లమ్ ఏరియా రజని బ్లాక్ గ్లాస్సెస్, లాంగ్ కోట్ ధరించి పోలిస్ యూనిఫామ్ లో ఇనుప రాడ్ తీసుకొని గుండాలని వేటాడటానికి సీరియస్ వెళుతున్నాడు. సూపర్ స్టార్ రజని, స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దర్బార్. ఈ మూవీ ఫస్ట్ లుక్ ని నిన్న విడుదల చేయడం జరిగింది.

చాలా కాలం తరువాత రజని పోలీస్ పాత్ర చేస్తున్నారు. పోలీస్ గెట్ అప్ లో రజని సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. 68ఏళ్ల వయసులో కూడా రజని స్టైల్ చూస్తుంటే ఆయనని స్టైల్ కి ఐకాన్ గా ఎందుకు చెప్పుకుంటారో అర్థం అవుతుంది.ఈ సారి రజని మంచి మాస్ మసాలా చిత్రాన్ని అందించి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తారనిపిస్తుంది.

కాగా దర్బార్ మూవీ కథ డిమాండ్ మేరకు ఎక్కువ భాగం ముంబైలో చిత్రీకర జరుపుకోనుందని సమాచారం.ముంబై మాఫియా కి వ్యతిరేకంగా ఓ పవర్ఫుల్ పోలీస్ చేసే పోరాటమే ఈ మూవీ కథాంశం అని వినికిడి.

నయనతార,నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా,అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు