హైదరాబాద్లో రజినీ.. కంగారులో అభిమానులు

Published on Apr 10, 2021 3:00 am IST


సూపర్ స్టార్ రజినీకాంత్ పూర్తిగా కోలుకుని ‘అన్నాత్తే’ షూటింగ్ రీస్టార్ట్ చేశారు. హైదరబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అయితే రజినీ హైదరాబాద్ రావడంతో ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం ఇక్కడ షూటింగ్ చేస్తుంటేనే సూపర్ స్టార్ అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత వెంటనే రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించారు. ఆ సంఘటనలన్నీ రజినీ అభిమానులను తీవ్రంగా కలచి వేసాయి. రజినీ ఆరోగ్యం బాగుండి ఉంటే ఈపాటికి ఎన్నికల్లో ఆయన పార్టీ కూడా ఉండేదని అనుకుంటున్నారు.

ఎక్కడైతే ఆయన అనారోగ్యానికి గురయ్యారో మళ్లీ అక్కడికే షూటింగ్ నిమిత్తం వెళ్లడం, కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో ఫ్యాన్స్ కొద్దిగా కంగారు ఫీలవుతున్నారు. ఈసారి ఎలాంటి ఆటంకం లేకుండా రజినీ చిత్రీకరణ కంప్లీట్ చేసుకుని క్షేమంగా రావాలని, ఇంకొక సినిమాకు రెడీగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే రజినీ కూడ తన జాగ్రత్తల్లో తాను ఉన్నారు. అన్ని రకాల ప్రికాషన్స్ తీకుంటున్నారు. సెట్లో రజనీకి ఎప్పుడూ ఒక డాక్టర్ల బృందం అందుబాటులో ఉందట. తక్కువమంది బృందంతో అన్ని రకాల నిబంధనలు, జాగ్రత్తలు పాటిస్తూ షూట్ చేస్తున్నారట. అంతేకాదు రజినీ మీద పని ఒత్తిడి లేకుండా నిదానంగానే చిత్రీకరణ జరుపుతున్నారట డైరెక్టర్ శివ.

సంబంధిత సమాచారం :