మనం టీంని మెచ్చుకున్న రాజమౌళి

ss-rajamouli
అక్కినేని మూడు తరాల హీరోలైన ఎఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్ర టీం పొగడ్తలతో ముంచేస్తున్నారు.

‘మనం సినిమా కథని సూపర్బ్ గా రాసుకున్నారు, అందరూ సూపర్బ్ గా నటించారు, సూపర్బ్ ఫోటోగ్రఫీ, సూపర్బ్ డైరెక్షన్, సూపర్బ్ మ్యూజిక్. ఎఎన్ఆర్ కి పర్ఫెక్ట్ ఫెర్వల్ ఈ సినిమా. ఇలాంటి కష్టతరమైన ఓ కథని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన విక్రమ్ కి నా అభినందనలు. ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది, ఎదిపిపిస్తుంది, ఎప్పటికీ గుర్తుండి పోతుంది. అందరూ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. నాగార్జున గారి స్టడీ పెర్ఫార్మన్స్, చైతూ మెచ్యూర్ పెర్ఫార్మన్స్ ఇక ఎఎన్ఆర్ గురించి ఏమి చెప్పగలను #ANRlivesON’ అని రాజమౌళి మనం బృందాన్ని మెచ్చుకున్నారు.

Exit mobile version