విలక్షణ నటుడు డా. రాజశేఖర్ త్వరలోనే తమిళ సూపర్ హిట్ అయిన ‘సూదు కవ్వం’ సినిమా రీమేక్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకి ‘గడ్డం గ్యాంగ్’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమాని అక్టోబర్ చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
త్వరలోనే రాజశేఖర్ సరసన షీన హీరోయిన్ నటిస్తోంది. జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సంతోష్ డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ రాజశేఖర్ తన లుక్ ని మార్చుకొని ఫుల్ గడ్డంతో కనిపించనున్నాడు. ‘సూదు కవ్వం’ సినిమా తమిళనాడులో పెద్ద హిట్ అవ్వడమే కాకుండా సరికొత్త ట్రెండ్ ని కూడా సెట్ చేసింది. అదే మేజిక్ ని ఇక్కడ రాజశేఖర్ రిపీట్ చేస్తాడా? అన్నది వేచి చూడాలి.


