రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘పాంచాలి పంచ భర్తృక’ ఫస్ట్ లుక్ విడుదల

రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ‘పాంచాలి పంచ భర్తృక’ ఫస్ట్ లుక్ విడుదల

Published on Jan 8, 2026 6:11 AM IST

Panchali Pancha Bhartruka First Look Poster

రాయల్ త్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయి రామ్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ట్రెండీ కామెడీ చిత్రం ‘పాంచాలి పంచ భర్తృక’. ‘లెస్ లాజిక్ – మోర్ మ్యాజిక్’ అనే ఆసక్తికరమైన ఉపశీర్షికతో దర్శకుడు గంగ సప్తశిఖర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “ఇదొక వినూత్నమైన కథ. కొత్త దర్శకుడు రూపొందిస్తున్న సరదా యూత్‌ఫుల్ చిత్రమిది. చాలా కాలం తర్వాత నేను నటించిన మంచి కామెడీ సినిమా ఇది. ఇందులో నా పాత్ర తెరపైనే చూడాలి” అని పేర్కొన్నారు. టైటిల్ వినగానే అందులో ఒక ఫన్ ఉందని, ఇలాంటి పేరు పెట్టడానికి ఎవరూ సాహసించలేదని ఆర్పీ పట్నాయక్ చిత్ర బృందాన్ని అభినందించారు.

ఈ చిత్రంలో వెంకట్ దుగ్గిరెడ్డి, రాజ్ పవన్, జెమినీ సురేష్, ర్యాప్ సింగర్ రోల్ రిడా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబీ కేఎస్‌ఆర్ కథను అందించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

Panchali Pancha Bhartruka First Look Poster

సంబంధిత సమాచారం

తాజా వార్తలు