‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల

కార్తీక్ గరిమెల్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కీలక పాత్రలు పోషిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా నటిస్తున్నారు.

​ఈ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని నటుడు రాజేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

​ఈ పాటకు జగదీష్ సాహిత్యం అందించగా, లాస్య ప్రియ ఆలపించారు. చిత్రానికి ఎస్. సుహాస్ సంగీతం సమకూరుస్తుండగా, రాజ్ నోముల ఛాయాగ్రాహకుడిగా, జమీర్ షేక్ కూర్పరిగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version