ప్రైమ్ వీడియోలోకి సిద్ధంగా ఉన్న రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్”..!

ప్రైమ్ వీడియోలోకి సిద్ధంగా ఉన్న రాజేంద్రప్రసాద్ “క్లైమాక్స్”..!

Published on Mar 31, 2021 3:02 PM IST

సీనియర్ నటులు నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క్లైమాక్స్‌’. న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ థియేటర్‌లో ప్రదర్శించిన ఘనత అందుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ‘డ్రీమ్‌’ దర్శకుడు భవానీ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి తొలి వారంలో థియేటర్లలో విడుదలైంది. విజయ్‌ మోడీగా రాజేంద్రప్రసాద్‌ నటన, భవానీ శంకర్‌ దర్శకత్వం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

అయితే ఈ సినిమా తాలూకా ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకుంది.మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది.. వచ్చే ఏప్రిల్‌ మిడ్‌ వీక్‌ నుంచి ‘క్లైమాక్స్‌’ వీక్షకులకు అందుబాటులోకి రానుంది. ఓటీటీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రేక్షకులు సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారట.

ఇక ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ పాత్ర పేరు విజయ్‌ మోడీ కావడం, ‘మోడీ డౌన్‌ టౌన్‌’ డైలాగ్‌ వల్ల ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాపై సూపర్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. మిస్టరీ కామిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో దేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్తలపై సెటైర్లు ఉన్నాయి. అందువల్ల, ఓటీటీలో సినిమా ఎప్పుడొస్తుందోనని ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. మరి ఈ సెటైరికల్ మరియు రాజేంద్రప్రసాద్ గారి నుంచి మళ్లీ ఓ డిఫరెంట్ సినిమా చూడాలి అనుకుంటే వచ్చే కొన్ని రోజులు ఆగాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు