అలాంటి పాత్రలు చేస్తే తప్పేముంది అంటున్న రాజేంద్రప్రసాద్

అలాంటి పాత్రలు చేస్తే తప్పేముంది అంటున్న రాజేంద్రప్రసాద్

Published on Jul 4, 2019 8:09 AM IST

సమంత ప్రధాన పాత్రలో నటించిన “ఓ బేబీ” రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. 70ఏళ్ల బామ్మ మనసు 20ఏళ్ల యంగ్ లేడీ కలిగి ఉంటే ఆ అమ్మాయి ప్రవర్తన ఎలాఉంటుందనే ప్రయోగాత్మక కథాంశంతో లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించారు. కాగా ఈ మూవీలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సమంత ను ప్రేమించే వృద్ధుడి గా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. “ఓ బేబీ” మూవీ ప్రచార కార్యక్రంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నఆయన కొన్ని ఆసక్తికర అంశాలు మీడియాతో పంచుకున్నారు.

‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు, భవిష్యత్తులో ప్రతినాయకుడిగా నటించే అవకాశం ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు, విలన్ రోల్స్ చేస్తే తప్పేముంది. ప్రస్తుతం జగపతి బాబు అలాంటి పాత్రలతోనే బిజీ అయ్యారు. కానీ ఏళ్ల తరబడి నన్ను ఒక హాస్య నటుడిగా చూసిన నా అభిమానులకు నేను ప్రతినాయకుడి పాత్రలు చేయడం నచ్చకపోవచ్చు అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు