చైనాలో రజిని 2.0 పరిస్థితి ఏమిటీ?

చైనాలో రజిని 2.0 పరిస్థితి ఏమిటీ?

Published on Sep 8, 2019 3:00 AM IST

అనేక అవరోధాలను అధిగమిస్తూ రజిని, శంకర్ ల రోబో 2.0 చిత్రం ఈనెల 6న చైనాలో గ్రాండ్ గా విడుదలైంది. దాదాపు 48వేల స్క్రీన్ లలో ఈ చిత్రం విడుదల చేయడం జరిగింది. ఐతే చైనాలో 2.0 కి దక్కుతున్న ఆదరణ బాగానే ఉందని సమాచారం. అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటిరోజు తొమ్మిది నుండి 10 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది.

నిజానికి 2.0 ఎప్పుడో విడుదల కావాల్సివుండగా ది లయన్ కింగ్ విడుదల కారణంగా ఈ చిత్ర విడుదల వాయిదా వేయడం జరిగింది. ఇండియాలో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లనే సాధించింది. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు