రజినీ 40 ఏళ్ళ ప్రస్థానంపై ఫ్యాన్స్ స్పెషల్ ప్లాన్స్

రజినీ 40 ఏళ్ళ ప్రస్థానంపై ఫ్యాన్స్ స్పెషల్ ప్లాన్స్

Published on Aug 17, 2015 7:33 PM IST

Rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్, ఈ పేరుకి కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియాలోనూ సూపర్బ్ క్రేజ్ ఉంది. కేవలం ఇండియాలోనే కాకుండా రజినీకాంత్ కి జపాన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రేపటితో రజినీకాంత్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు పూర్తి చేసుకోనున్నాడు. రజినీకాంత్ 1975 ఆగష్టు 18న రిలీజ్ అయిన ‘అపూర్వ రాగంగల్’ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు.

లెజండ్రీ డైరెక్టర్ కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి రేపటితో 40 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు కమల్ హాసన్ కూడా నటించాడు.

రజినీకాంత్ 40 ఏళ్ళ కెరీర్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా రజినీ అభిమానులు ఈ లాంగ్ కెరీర్ ని ఎప్పటికీ మరిచిపోకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే అభిమానులంతా కలిసి దేశ వ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్ అభిమానులంతా కలిసి పలు సామాజిక కార్యక్రమాలు, హెల్త్ క్యాంపు కార్యక్రమాలను చేయనున్నారు. ముఖ్యంగా తమిళనాడులో చాలా కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా గ్రాండ్ గా బర్త్ డే వేడుకలని కూడా చేయనున్నారు. ఈ 40 ఏళ్ళ కెరీర్లో రజినీకాంత్ ఇప్పటి దాకా 158 సినిమాలు చేసాడు. రీసెంట్ గా రజింత్ డైరెక్షన్ లో తన 159వ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత రోబో 2 ని మొదలు పెట్టనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు