హింస సమస్యకు పరిష్కారం కాదు- రజిని కాంత్

Rajini

ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్‌ పౌరసత్వ సవరణ బిల్లు పై స్పందించారు. కొద్దిరోజులుగా ఈ బిల్లు కారణంగా ఏర్పడిన పరిస్థితులు, నిరసనలు, హింసాత్మక ఘటనలు చూసిన రజినీకాంత్ ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయం తెలియజేశారు.హింస అనేది సమస్యలకు పరిష్కారం కాదని రజినీ తెలిపారు. భారత పౌరులంతా ఐక్యంగా ఉండాల్సి ఉందని పేర్కొంటూ, దేశ భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచకుని అప్రమత్తంగా వ్యవహరించాలని ట్వీట్ పెట్టారు రజినీకాంత్. జరుగుతున్న హింసాత్మక పరిణామాలకు తానూ తీవ్రంగా కలత చెందుతున్నానని ఆయన తెలిపారు. రజనీకాంత్ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక రజిని లేటెస్ట్ మూవీ దర్బార్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రజిని కాంత్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల విడుదలైన ఈచిత్ర ట్రైలర్ విశేష స్పందన దక్కించుకుంది. దర్బార్ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు.

Exit mobile version