సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘దర్బార్’. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అలాగే రజని పాత్రలో మరో షేడ్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఆ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో రజని సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. రజని – మురుగదాస్ కలయికలో వస్తోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రంతో మరి ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.


