చిరు బర్త్‌డేకు రజనీ కాంత్, సల్మాన్ ఖాన్

చిరు బర్త్‌డేకు రజనీ కాంత్, సల్మాన్ ఖాన్

Published on Aug 22, 2015 10:47 AM IST

chiru-birthday
చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగిన మెగా స్టార్. 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ రంగప్రవేశం చేసిన చిరు, ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. మళ్ళీ ఇన్నాళ్ళకు చిరు హీరోగా 150వ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథల ఎంపిక జరుగుతోంది. అన్నీ సెట్ అవ్వగానే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక చిరంజీవి కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారని తెలియగానే మొత్తం సినీ పరిశ్రమ ఆసక్తి అటువైపు మళ్ళింది. ఈ క్రమంలోనే చిరంజీవి 60వ పుట్టినరోజు కూడా రావడంతో ఆ ఆసక్తి రెట్టిపైంది.

నేడు (ఆగష్టు 22) చిరంజీవి తన 60వ జన్మదిన వేడుక జరుపుకోనున్నారు. నిన్న సాయంత్రమే అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున జరుపున్న చిరు, నేడు పలువురు ప్రముఖులు, బంధువుల సమక్షంలో జరుపుకోనున్నారు. చాలా పెద్ద ఎత్తున జరగనున్న ఈ వేడుకకు ఇండియన్ సినిమా టాప్ స్టార్స్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, సల్మాన్ ఖాన్ తదితరులు ఈ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం. ఇదే వేడుకకు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. చిరు 60వ పుట్టినరోజు అందరికీ గుర్తుండిపోయేలా చేసేందుకు చిరు ఫ్యామిలీ భారీ ఏర్పాట్లు చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు