హైకోర్ట్ లో కేసు వేసిన రజినీకాంత్.

హైకోర్ట్ లో కేసు వేసిన రజినీకాంత్.

Published on Sep 17, 2014 4:29 PM IST

rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ కేసు వేయడంతో ‘మై హు రజనీకాంత్’ అనే హిందీ సినిమా విడుదలపై స్టే చెన్నై హైకోర్ట్ స్టే విధించింది. నిర్మాతలను కోర్ట్ కు స్వయంగా హాజరయి సమాధానం ఇవ్వవలసిందిగా ఆదేశించింది.

అసలు వివరాలలోకి వెళ్తే ‘బిల్లా’, ‘సింహ’, ‘దూకుడు’, ‘మిర్చి’ తదితర తెలుగు సినిమాలలో నటించిన తమిళ నటుడు ఆదిత్య ప్రధాన పాత్రలో ‘మై హు రజనీకాంత్’ అనే హిందీ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కాంట్రాక్ట్ కిల్లర్ కం సిబిఐ ఆఫీసర్ రజినీకాంత్ రావు పాత్రలో ఆదిత్య నటించాడు. త్వరలో విడుదలకు సిద్దమవుతుంది.

ఈ సినిమా తన ఇమేజ్ డామేజ్ చేసే విధంగా ఉందని, అందువల్ల సినిమా విడుదలపై నిషేధం విధించాలని రజినీకాంత్ కోరారు. రజిని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న చెన్నై హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు