రజినీ ఫాన్స్ కి ఇచ్చిన సందేశం

Rajini-kanth
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరుకి కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, నార్త్ ఇండియా, జపాన్, సౌత్ ఆసియాలతో పాటు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా వస్తుందన్నా, ఆయన పుట్టిన రోజు వస్తుందన్నా ఆడియన్స్ పండగ చేసుకుంటారు. రజినీకాంత్ బర్త్ డే ని తమ పుట్టిన రోజులా జరుపుకోవడమే కాకుండా అభిమానులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. ఎప్పటిలానే ఈ ఏడాది డిసెంబర్ 14న కూడా రజినీ బర్త్ డే వేడుకల్ని అభిమనులు ఘనంగా చేయాలని అనుకున్నారు. కానీ గత 20 రోజులుగా భారీగా చెన్నైలో కురుస్తున్న వర్షాల వలన ఇప్పుడు ఆ వేడుకల్ని ఆపేశారు.

ఈ విషయంలో స్వయంగా రజినీకాంత్ కలుగ చేసుకున్నారు. రజినీకాంత్ తన అభిమానులకు, ఫ్యామిలీ మెంబర్స్ కి తన బర్త్ డేకి ఎలాంటి హడావిడి చేయద్దని, అలా ఖర్చు చేసే అమౌంట్ మొత్తాన్ని చెన్నై బాధితుల సహాయ సహకారాల కోసం ఖర్చు చేయాలని, ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వారందరికీ ఫుడ్ అందజేయాలని రజినీకాంత్ చెప్పాడు. దాంతో అభిమానులు కూడా వరద బాదుతులకు తమ సహాయ సహకారాల్ని అందిస్తున్నారు. రజినీకాంత్ తన వంతుగా సహాయం అందించడమే కాకుండా తన అభిమానులను కూడా ఇలా సహాయ సహకారాలను అందించమని చెప్పి తన సహ్రుదయాన్ని మరోసారి చాటుకున్నాడు.

Exit mobile version