ధర్మన్ : నలుగురు డైరెక్టర్ల మార్పుపై రజినీకాంత్ క్లారిటీ..!

ధర్మన్ : నలుగురు డైరెక్టర్ల మార్పుపై రజినీకాంత్ క్లారిటీ..!

Published on Jun 24, 2026 6:38 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, లెజెండరీ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఎట్టకేలకు ఖరారైంది. కమల్ హాసన్ నిర్మాణంలో యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు రూపొందించే ఈ చిత్రానికి ‘ధర్మన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇన్నాళ్లూ ఉన్న కన్‌ఫ్యూజన్‌కు తెరదించుతూ, సినిమా అనౌన్స్‌మెంట్ రోజే ఫస్ట్‌లుక్ లాంచ్‌తో పాటు ప్రెస్ మీట్ నిర్వహించి అభిమానులకు చిత్ర బృందం పూర్తి క్లారిటీ ఇచ్చింది.

అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ముందు ముగ్గురు దర్శకులు మారడం వెనుక గల కారణాలను రజినీకాంత్ స్వయంగా వెల్లడించారు. మొదట సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్‌ను అనుకున్నా కథ సెట్ కాకపోవడంతో ఆయన తప్పుకున్నారని, ఆ తర్వాత వచ్చిన సుందర్.సి వేరే కమిట్‌మెంట్ల వల్ల ఆలస్యం అవుతుందని పక్కకు తప్పుకున్నారని తెలిపారు. ఇక మూడవ దర్శకుడు శిబి చక్రవర్తి ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ కథను సిద్ధం చేసినప్పటికీ, అది విదేశాల్లో షూటింగ్ చేయాల్సిన భారీ సబ్జెక్ట్ కావడం, చాలా సమయం తీసుకునే సెన్సిటివ్ స్టోరీ కావడంతో ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టామని రజినీ పేర్కొన్నారు.

చివరగా యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు చెప్పిన కథ అన్ని రకాలుగా సరిగ్గా సరిపోవడంతో ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నట్లు సూపర్ స్టార్ స్పష్టం చేశారు. కళ్లు చెదిరే కాంబినేషన్‌లో రాబోతున్న ఈ ‘ధర్మన్’ చిత్రంపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు