సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ 2 చిత్రం విడుదల కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కలయికలో రజనీకాంత్ చేస్తున్న మరో చిత్రమే ధర్మన్. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి జెట్ స్పీడ్ లో చిత్రీకరణ పూర్తి చేసుకుంటూ వస్తుంది.
ఇలా రెండు షెడ్యూల్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా మూడో షెడ్యూల్ లోకి ఎంటర్ అయినట్టుగా దర్శకుడు ఓ వీడియో క్లిప్ తో ఫ్యాన్స్ కి అప్డేట్ అందించాడు. అయితే ఈ షూట్ షెడ్యూల్ రజనీకాంత్ అలాగే యువ హీరోయిన్ రాశీ ఖన్నా లపై కీలక సీన్స్ తో చేస్తున్నట్టుగా వీడియోలో చూస్తే అర్థమవుతుంది.
సో మొత్తానికి ధర్మన్ ఇలా నిర్విరామంగా దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. మన టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని విలన్ రోల్ లో కనిపించనున్నాడు.
Back with Thalaivar for Dharman 3rd schedule 🔥#superstar@RKFI pic.twitter.com/dMowuKe2t9
— Ashwath Marimuthu (@Dir_Ashwath) September 16, 2026
