ఇపుడు మూవీ లవర్స్ అంతా మాట్లాడుకుంటున్న క్రేజీ మల్టీ స్టారర్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ రజినీకాంత్ ఆలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కలయిక కోసమే అని చెప్పాలి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ప్రోమో ఇప్పుడు ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారింది.
అయితే ఇద్దరు ఇద్దరు లెజెండ్స్ కూడా తమదైన శైలిలో కనిపించారు. ఇక ఇదే క్రమంలో ఎవరు హీరో అనేది చర్చ కూడా కొనసాగుతుంది. అయితే ఓవరాల్ న్యూట్రల్ ఆడియెన్స్ లో మాత్రం తలైవర్ డామినెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. కమల్ తో పాటు కలిసి నడిచి వచ్చే ఫ్రేమ్స్ లో రజినీకాంత్ కంప్లీట్ గా కమల్ ని డామినేట్ చేసేశారని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.
దీనితో న్యూట్రల్ ఆడియెన్స్ లో మాత్రం ఒకింత రజినీకాంత్ కే ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. ఇంకోపక్క హీరో రజినీకాంత్, విలన్ కమల్ హాసన్ అంటూ కూడా కొన్ని థియరీలు స్టార్ట్ చేశారు. మరి ఇవన్నీ ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి.


