
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగా’. ఇటీవలే మైసూర్ లో ప్రారంభమైన మొదటి షెడ్యూల్ పూర్తయ్యిందని ఇది వరకే తెలియజేశాం. ఈ షెడ్యూల్ లో రజినీకాంత్, సోనాక్షి సిన్హాలపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసారు.
త్వరలోనే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. మాకున్న సమాచారం ప్రకారం మే 25 నుండి ఈ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 1990లలో రజినీకాంత్ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో ‘ముత్తు’, ‘నరసింహా’ లాంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాతో మళ్ళీ ఆ మేజిక్ ని రిపీట్ చేస్తారా? అనేది చూడాలి.

