‘భారతీయుడు-2’ ఆడియో ఫంక్షన్ కి రజనీకాంత్ ?

‘భారతీయుడు-2’ ఆడియో ఫంక్షన్ కి రజనీకాంత్ ?

Published on May 19, 2024 9:42 PM IST


శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు-2. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ కు రంగం సిద్ధమైంది. జూన్ 1 నుంచి ఈ సినిమా గ్రౌండ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ 1 న చెన్నైలో జరిగే ఆడియో ఫంక్షన్ ను భారీ స్థాయిలో చేయబోతున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీని జులై 12కు వాయిదా వేసినట్లు టాక్‌. కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తోంది భారతీయుడు-2. మరి ఏ రేంజ్ లో విజయం సాధిస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు