దర్శకుడ్ని ఇంటికి పిలిచి మరీ మాట్లాడిన రజనీ !

Published on May 28, 2019 8:28 pm IST


తమిళ పరిశ్రమలో దర్శకుడు శివకు మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే అజిత్ హీరోగా వరుసగా నాలుగు హిట్ సినిమాలను తీశాడు శివ. ఆయన చివరగా అజిత్‌తో చేసిన ‘విశ్వాసం’ భారీ విజయాన్నే అందుకుంది. ఇప్పుడు ఈ దర్శకుడికి ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నుండి కాల్ వచ్చింది. రజనీ శివను ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడారట.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శివతో రజనీ ఒక సినిమా చేయడం ఖాయమని, అజిత్‌ను వీర లెవల్లో చూపించిన శివ రజనీను ఏ స్థాయిలో చూపిస్తారోనని ఎగ్జైట్ అవుతున్నారు. మరి రజనీ ఇచ్చిన అవకాశాన్ని శివ సద్వినియోగం చేసుకుని సినిమా సెట్ చేసుకుంటారో లేదో చూడాలి. ఇకపోతే రజనీ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో ‘దర్బార్’ అనే సినిమా చేస్తుండగా శివ త్వరలో సూర్యతో ఒక సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.

సంబంధిత సమాచారం :

More