మైసూర్ ప్యాలెస్ గోల్డ్ రూంలో రజినీకాంత్ ‘లింగా’

మైసూర్ ప్యాలెస్ గోల్డ్ రూంలో రజినీకాంత్ ‘లింగా’

Published on May 20, 2014 2:10 PM IST

rajini-kanth
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘లింగా’. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది. ఈ షెడ్యూల్లో భాగంగానే మైసూర్ ప్యాలెస్ గోల్డ్ రూం లో షూట్ చేయాలనుకున్నారు. కానీ అప్పుడు అక్కడి అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈ చిత్ర టీం వెనుతిరిగారు.

కానీ రజినీకాంత్, ఈ చిత్ర టీం ఎట్టకేలకు ‘లింగా’ సినిమాని ఆ గోల్డ్ రూంలో షూట్ చేయడానికి పర్మిషన్ సాధించారు. మొత్తం గోల్డ్ మాయమైన ఈ రూంని మైసూర్ మహారాజ వినియోగించేవారు. ఈ గోల్డ్ రూంలో షూట్ చేస్తున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఈ గోల్డ్ రూంలో ఒక పాటని, కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తారు.

ఈ నెల 25 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో లింగా రెండవ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మైసూర్ ప్యాలెస్ లో షూట్ చేసే అవకాశం ఉంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

తాజా వార్తలు