రజనీ పోరాటం హైదరాబాద్లోనే

రజనీ పోరాటం హైదరాబాద్లోనే

Published on Feb 19, 2020 6:41 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని శివ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూట్ హైదరాబాద్లోనే మొదలైంది. తాజా షెడ్యూల్ కూడా సిటీలోనే జరుగుతోంది రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ పబ్ సెట్లో రజనీపై భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. దీని కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతున్నారట. సినిమాలో కనిపించే పోరాట సన్నివేశాల్లో ఇదే లావిష్ ఫైట్ అని తెలుస్తోంది.

ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, సిద్దార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. రజనీ తొలిసారి శివ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం పూర్తికాగానే కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఒక చిత్రం చేసే ఆలోచనలో ఉన్నారు రజనీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు