
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటి యువకులకన్నా ఎక్కువ ఉత్సాహంతో శక్తి తో వుంటారు. ఎంతో ధృడంగా చురుకుగా వుండే రజనీ ప్రస్తుతం ‘లింగా’ చిత్రం కోసం కొన్ని సహోసోపేతమైన స్టంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న ఈ చిత్రంలోని ఈ సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నారు.
రోప్ వర్క్ తో పాటు కొన్ని జంప్ సన్నివేసాలని చిత్రికరిస్తుండగా రజనీ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కె.యెస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ నిర్మిస్తున్నారు.
అనుష్క మరియు సోనాక్షి సిన్హా ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.