మోడీ ప్రమాణస్వీకారానికి సూపర్ స్టార్ !

Published on May 28, 2019 3:59 pm IST

నరేంద్ర మోడీ వరుసగా రెండవసారి ప్రధాని కానున్నారు. ఈ నెల 30వ తేదీన ఢిల్లీలో ఆయన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. దేశంలోని పలువురు ప్రముఖులను తన ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరుకావాలని మోడీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారిలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు.

రజనీ సైతం మోడీ ఆహ్వానాన్ని అంగీకరించి వేడుకకు వెళుతున్నట్టు తెలిపారు. దేశంలో నెహ్రు, రాజీవ్ గాంధీల తరవాత అంతటి ఛరీష్మా ఉన్న నాయకుడు నరేంద్ర మోడీ అని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ రాజీనామాపై స్పందిస్తూ రాహుల్ తనని తాను నిరూపించుకోవాలని, ఆయనలో ఆ శక్తి ఉందని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎప్పుడూ బలంగా ఉండాలని అన్నారు.

సంబంధిత సమాచారం :

More