మైసూరులో ఇబ్బందిలో పడ్డ రజీనికాంత్ ‘లింగా’ చిత్ర సిబ్బంది

rajini-kanth
నిన్న మైసూరులో ప్రారంబమైన రజీనికాంత్ హీరోగా నటిస్తున్న’లింగా’ సినిమాకి ఆదిలోనే ఆటంకాలు ఎదురయాయి. ఈ సినిమా షూటింగ్ ను మైసూరు ప్యాలస్ లోపల తీయాలని చిత్ర సిబ్బంది ప్లాన్ చేసుకున్నారు. కానీ అక్కడి అధికారులు వీరిని అడ్డుకున్నారు. మైసూరు ప్యాలస్ లోపల షూటింగ్ జరపడానికి మైసూరు మహారాజ అనుమతి తీసుకోవాలని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ‘లింగా’ చిత్ర సిబ్బంది, ఎలాంటి అనుమతి తీసుకోకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ని అక్కడి అధికారులు నిలిపివేశారు.

కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని, రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. అనుష్క శెట్టి మరియు సొనక్షి సిన్హా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి కొన్ని రోజులు మైసూరు చుట్టు ప్రక్కల జరిగే ‘లింగా’ తదుపరి షెడ్యుల్ హైదరాబాద్ లో జరగనుంది. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి ఏఅర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Exit mobile version