రజినీకాంత్ ‘వెట్టయాన్’ లేటెస్ట్ షూట్ అప్ డేట్

రజినీకాంత్ ‘వెట్టయాన్’ లేటెస్ట్ షూట్ అప్ డేట్

Published on Feb 11, 2024 3:00 AM IST


తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా లాల్ సలాం మూవీలో ఒక కీలక పాత్ర చేసారు. ఆయన కుమార్తె సౌందర్య రజినీకాంత్ తెరకెక్కించిన ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు చేసారు. నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం టీజె జ్ఞానవేల్ తో రజినీకాంత్ చేస్తోన్న మూవీ వెట్టయాన్.

అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దూషరా విజయన్ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. మ్యాటర్ ఏమిటంటే, కొన్నాళ్ల క్రితం షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ ఇప్పటికే 80% వరకు షూట్ ని కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ యాక్షన్ డ్రామా మూవీగా రూపొందుతున్న వెట్టయాన్ త్వరలో ఆడియన్స్ ముందుకి రానుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీనిని సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక దీని అనంతరం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు