మురుగదాస్‌తో రజనీ కొత్త సినిమా?

rajnikanth-murgadas

కొచ్చాడయాన్, లింగా లాంటి రెండు వరుస ఫ్లాపుల తర్వాత రజనీకాంత్ కొత్త సినిమా పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. లింగా విడుదలై మూడు నెలలైనా ఇప్పటికీ ఏ సినిమానీ అంగీకరించలేదు. తాజా సమాచారం మేరకు రజనీ, మురుగదాస్‌తో సినిమా తీసేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మురుగదాస్ అయితే బలమైన కథని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో డీల్ చేయగల సమర్ధుడని ఆయన భావిస్తున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటికింకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారని కోలీవుడ్ టాక్.

ప్రస్తుతం మురుగదాస్, బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నారు. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్ర పోషించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇంతకుముందే తెలియజేసినట్లు పకడ్బందీ స్క్రిప్ట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసేలా షెడ్యూల్ తయారు చేశారు. ఈ సినిమా పూతి కాగానే రజనీ సినిమా పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

Exit mobile version