రజినీ 166 షూటింగ్ అప్డేట్ !

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనున్న 166 వచిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ 10నుండి స్టార్ట్ కానుందని సమాచారం. ఈ చిత్రంలో రజినీ కి జోడిగా స్టార్ హీరోయిన్ నయనతార నటించనుందట. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తలైవా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మొదటి సారి రజినీ-మురుగదాస్ కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version