కేరళలో రికార్డ్ క్రియేట్ చేసిన రజినీ ‘లింగ’

కేరళలో రికార్డ్ క్రియేట్ చేసిన రజినీ ‘లింగ’

Published on Dec 11, 2014 3:09 PM IST

Linga
సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు, సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘లింగ’ సినిమా మరి కొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే రజినీ అభిమానుల కోలాహలంతో థియేటర్స్ దగ్గర సందడి మొదలైంది. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా 2500కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇన్ని థియేటర్స్ పక్కన పెడితే రజినీకాంత లింగ తో కేరళలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

‘లింగ’ సినిమా కేరళలో 215కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. డైరెక్ట్ మలయాళ సినిమా తప్ప మరే ఇతర భాష లేదా డబ్బింగ్ సినిమా కేరళలో అన్ని థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. అలాంటి రికార్డ్ బ్రేక్ చెయ్యడం ఒక్క రజినీకాంత్ ‘లింగ’ కి మాత్రమే దక్కింది. ఇది కాకుండా ఇప్పటికే జపాన్ నుంచి కొంతమంది అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెన్నై చేరుకున్నారు. లీగల్ అన్ని సస్యాలను క్లియర్ చేసుకున్న ఈ సినిమా రేపు రిలీజ్ అవుతోంది.

రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా కనిపించారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. కెఎస్ రవికుమార్ రజినీకాంత్ బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కి అందిస్తున్న ఈ సినిమా అభిమానుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి..

తాజా వార్తలు