తమిళ యువతకు రజినీకాంత్, లారెన్స్ ల విన్నపం !

rajini-kanth-lawarance
ఇప్పటివరకు శాంతియుత వాతావరణంలో జరిగిన జల్లికట్టు ఉద్యమం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది.మెరీనా బీచ్ ని విడిచి వెళ్లాలని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన కారులను కోరగా వారు వెళ్ళలేదు. దీనితో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు నిరసనకారులు పోలీస్ స్టేషన్ ని తగలబెట్టడంతో పోలీస్ లు లాఠీ ఛార్జ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది.

దీనిపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించాడు.ఓ లేఖ ద్వారా యువతకు సందేశాన్ని అందించాడు. యువత హింసాత్మక నిరసనలు చేయవద్దని , నిరసనలు వదలిపెట్టి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని రిక్వస్ట్ చేసాడు. లారెన్స్ కూడా దీనిపై స్పందించాడు . యువత నిరసన లు వదిలిపెట్టాలని కోరాడు. వీరితోపాటు పలువురు సెలెబ్రిటీలు వీడియో మెసేజ్ ల ద్వారా నిరసనలు ఆపాలని కోరారు.జల్లికట్టు నిరసనలు హింసాత్మకంగా మారి పరిస్థితులు చేదాటిపోతుండడంతో పలువురు సెలబ్రిటీలు నిరసనలు ఆపాలని యువతని కోరుతున్నారు.

Exit mobile version