పెళ్ళికి రెడీ అయిపోయిన యంగ్ హీరో

Published on May 29, 2019 8:28 am IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంట. ఆవిషయాన్ని ఆయనే స్వయంగా తన అభిమానులతో పంచుకున్నారు. రీసెంట్‌గా ట్విట్ట‌ర్‌లో చాట్ చేసిన రాజ్ త‌రుణ్ త‌ను పెళ్లి చేసుకోబోతున్న విష‌యాన్ని తెలియ‌జేశాడు.మ‌రి ఆ అమ్మాయి సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన హీరోయిన్నా లేక బ‌య‌ట ప‌రిచ‌య‌మైన అమ్మాయా అనే విషయం తెలియాల్సివుంది.

కెరీర్ మొద‌ట్లో జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ వెళ్ళిన కుర్ర హీరో రాజ్ త‌రుణ్ ఇప్పుడు కాస్త స్లో అయ్యాడు. ప్ర‌స్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెర‌కెక్కుతున్న “ఇద్ద‌రి లోకం ఒక‌టే” చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇందులో షాలిని పాండేని క‌థానాయిక‌గా ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More