సక్సెస్ టూర్లో ‘రాజుగారి గది’!

Raju-Gari-kadha
బుల్లితెరపై రియాలిటీ షోస్ హోస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్, ఆ తర్వాత ‘జీనియస్’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. జీనియస్ సినిమా సూపర్బ్ రిజల్ట్ ఇవ్వకపోయినా, ఓంకార్‌కి దర్శకుడిగా మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘జీనియస్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్, తాజాగా మొదటి ప్రయత్నానికి భిన్నంగా ‘రాజుగారి గది’ అంటూ హర్రర్ కామెడీతో మనముందుకు వచ్చారు.

దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదలైన ఈ సినిమా, విడుదలైన అన్నిచోట్లా సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకెళుతోంది. ఓ సాధారణ చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి గది, ప్రస్తుతం దసరా సీజన్‌లో మంచి కలెక్షన్స్‌తో హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలోనే రాజుగారి గది టీమ్ నేటినుంచి ఓ సక్సెస్ టూర్‌ను ఏర్పాటు మొదలుపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగనున్న ఈ టూర్లో దర్శకుడు ఓంకార్‌తో పాటు ఇతర యూనిట్ సభ్యులు ఈ సక్సెస్ టూర్లో పాల్గొననున్నారు. ఈ సినిమా నేటినుంచి అమెరికాలోనూ ప్రదర్శితమవుతోంది.

Exit mobile version