బుల్లి తెరపై డబుల్ డిజిట్‌తో సత్తా చాటిన రాజుగారి గది 3..!

బుల్లి తెరపై డబుల్ డిజిట్‌తో సత్తా చాటిన రాజుగారి గది 3..!

Published on Jan 4, 2020 11:20 AM IST

Raju

ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ హీరోగా గత ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ అయిన రాజుగారి గది 3 సినిమా వెండితెరపై మంచి సక్సెస్ టాక్‌ని సంపాదించుకుంది. అయితే డిజిటల్ రివల్యూషన్ లో స్టార్ వాల్యూ ఉన్న సినిమాలకు బుల్లి తెరపై డబుల్ డిజిట్ టీఆర్పీ రావడం చాలా అరుదు అనే చెప్పాలి. అయితే రాజుగారి గది 3 సినిమా బుల్లి తెరపై డబుల్ డిజిట్ సాధించడంతో ఇప్పడు ఆ రేటింగ్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

అయితే డిసెంబర్ మూడో వారంలో స్టార్ మా లో ప్రదర్శించబడిన రాజుగారి గది 3 కి 11.6 టీఆర్పీ రేటింగ్ సాధించి వెండితెరపైనే కాదు బెల్లి తెరపై కూడా ఈ సినిమా తన సత్తాను చాటుకుంది. అయితే ఈ సినిమా ప్రదర్శించిన రోజు ఇండియా, వెస్టిండీస్ కి జరిగే ఫైనల్ మ్యాచ్ ఉన్నా డబుల్ డిజిట్ రేటింగ్ సాధించడంతో స్టార్ మా టీం కూడా రాజుగారి గది 3 టీంని అభినందించింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించి గతేడాది హిట్ సినిమా లలో ఒకటిగా నిలిచింది. అయితే రాజుగారి గది కి హార్రర్ బ్యాక్ డ్రాప్ ఉన్నా కూడా అది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఓంకార్ సినిమాను మలచడంతో బుల్లి తెరపై కూడా ఆ రేంటింగ్స్ సాధించగలిగింది అని విశ్లేషకులు అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు