రాజుగారి గది3 మొదటిరోజు కలెక్షన్స్ రిపోర్ట్

రాజుగారి గది3 మొదటిరోజు కలెక్షన్స్ రిపోర్ట్

Published on Oct 19, 2019 2:09 PM IST

అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా దర్శకుడు ఓంకార్ తెరకెక్కించిన రాజుగారి గది 3 మూవీ నిన్న గ్రాండ్ గా విడుదలైంది. హార్రర్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ డే డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా పర్లేదు అన్నట్లుగా మొదటి రోజు కలెక్షన్స్ సాధించింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో రాజుగారి గది 3 చిత్రం మొదటిరోజు 1.25 కోట్ల షేర్ వసూలు చేసింది. నైజాంలో 42లక్షల వసూళ్లు సాధించిన ఆంధ్రా మొత్తం కలిపి 83 లక్షల షేర్ రాబట్టింది. నేడు అలాగే రేవు ఆదివారం వచ్చే కలెక్షన్స్ బట్టి ఈ చిత్ర ఫలితం ఆధారపడి ఉంటుంది. వచ్చే వారం దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర వసూళ్లు కొంచెం మెరుగయ్యే అవకాశాలు కలవు. అలీ,బ్రహ్మజీ, ఊర్వశి, ప్రభాస్ శ్రీను, ధన్ రాజ్, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు చేశారు.

ఏరియాల వారీగా రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్టన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం రూ. 42 లక్షలు
సీడెడ్ రూ. 24 లక్షలు
వైజాగ్ రూ.16 లక్షలు
గుంటూరు రూ.14 లక్షలు
ఈస్ట్ రూ.10 లక్షలు
వెస్ట్ రూ.6 లక్షలు
కృష్ణా రూ. 9 లక్షలు
నెల్లూరు రూ. 4 లక్షలు
ఏపీ/తెలంగాణా మొదటిరోజు షేర్ రూ.1.25 కోట్లు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు