వారాంతానికి బాగానే లాగిన రాజుగారి గది3.

వారాంతానికి బాగానే లాగిన రాజుగారి గది3.

Published on Oct 21, 2019 1:30 PM IST

రాజుగారి గది ఫ్రాంచైజ్ లో వచ్చిన మూడవ చిత్రం రాజుగారి గది 3 గత శుక్రవారం విడుదలైంది. హారర్ కామెడీ జోనర్ లో వచ్చిన ఈ మూవీకి క్రిటిక్స్ నుండి మిశ్రమ స్పందన లభించి. ఐతే టాక్ ఎలా ఉన్నా రాజుగారి గది 3 తన స్థాయి వసూళ్లతో పరవాలేదనిపిస్తుంది. నిన్న ఆదివారం ఈ మూవీ నైజాంలో 37లక్షల షేర్ వసూళ్లు సాధించింది. ఇక మొత్తంగా వీకెండ్ ముగిసేనాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మూడురోజులకు గాను, 3.5 కోట్ల షేర్ రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్ మరియు హక్కుల అమ్మకాల దృష్ట్యా ఈమూవీ ఇంకా రెండు మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ చేరే అవకాశం కలదు.

ఒక వర్గం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతున్న ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ కి స్వల్ప లాభాలు కట్టబెట్టే అవకాశం కలదు. ఇక డిజిటల్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా నిర్మాతలకు ఇంకొంత లాభం చేకూరుతుంది అనడంలో సందేహం లేదు. దీపావళి పండుగకు కూడా తమిళ డబ్బింగ్ చిత్రాలు తప్ప టాలీవుడ్ నుండి చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేకపోవడం వలన ఎంతో కొంత వసూళ్లు కలిసిరావచ్చు. ఈ వారంలో రాజుగారి గది 3 చిత్రం సాధించే వసూళ్లను బట్టి అది ఏస్థాయి విజయం సాధించిందో అర్థం అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు