చిన్నారి పెళ్లి కూతురు ఇంత భయంకరంగానా…!

చిన్నారి పెళ్లి కూతురు ఇంత భయంకరంగానా…!

Published on Sep 2, 2019 9:28 AM IST

డబ్బింగ్ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి అవికా గౌర్. ఆ సీరియల్ కారణంగా వచ్చిన ఫేమ్ తో అవికా బాలనటిగా హిందీ చిత్రాలలో నటించింది. తెలుగులో రాజ్ తరుణ్ సరసన ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆమె నటించిన సినిమా చూపిస్తమామా, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలు మంచి విజయం సాధించాయి.

కారణాలేమైనా ఆమె సినిమాలనుండి కొంచెం గ్యాప్ తీసుకున్నారు. తాజాగా అవికా రాజుగారి గది3 చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు ఓంకార్ తెరకెక్కిస్తున్న రాజుగారి గది సిరీస్ లో మూడవ చిత్రంగా రాజుగారి గది3 తెరకెక్కుతుంది. ఇప్పటివరకు క్యూట్ లవ్లీ గర్ల్ పాత్రలు చేస్తున్న అవికా ఈ సారి ప్రేక్షకులను భయపెట్టనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా, ఆ పోస్టర్లో అవికా లుక్ భయపెట్టేదిలా ఉంది.

గత రెండు చిత్రాలలో నటించిన అశ్విన్ బాబు ఈ చిత్రంలో కూడా హీరోగా నటిస్తుండగా, ఓంకార్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే దసరా కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు