‘విజయ్ – త్రిష’ మెహందీ ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తోందట !

దళపతి విజయ్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు విజయ్ తో పాటుగా త్రిషకు సంబంధించిన విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో క్లారిటీ లేదు గాని, ఏదో వ్యవహారం నడుస్తోందని పుకార్లు మాత్రం బాగా ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఆశ పడుతోంది బాలీవుడ్ నటి రాఖీ సావంత్ .

తాజాగా రాఖీ సావంత్.. ‘విజయ్-త్రిష’ల పై వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ.. వారిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుంటే వారి మెహందీ ఫంక్షన్ లో నేను సందడి చేస్తా. ఎందుకంటే.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ల నుంచే త్రిష నాకు తెలుసు. ఇద్దరం కలిసి కష్టపడ్డాము, ఆ తర్వాత త్రిష సౌత్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయి, మంచి స్థాయికి ఎదిగింది. ఇక నేను విజయ్ తో ఒక్క పాట అయినా చేయాలని కలలు కన్నాను. కానీ, ఆ అవకాశం రాలేదు. కనీసం వారి మెహందీ ఫంక్షన్ లో అయినా డాన్స్ చేస్తాను’ అని రాఖీ సావంత్ తెలిపింది.

Exit mobile version