నాకు ఎంతో సపోర్ట్ చేశారు – బెల్లంకొండ శ్రీనివాస్

నాకు ఎంతో సపోర్ట్ చేశారు – బెల్లంకొండ శ్రీనివాస్

Published on Jul 31, 2019 2:33 AM IST

రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రాబోతున్న చిత్రం “రాక్షసుడు”. తమిళంతో విజయవంతమైన “రాక్షసన్” చిత్రానికి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. కాగా ఈ సంద‌ర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘ‌నంగా జరువుకుంది. ఈ ఈవెంట్ లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో మీరు (ప్రేక్షకులను ఉద్దేశిస్తూ) నాకు ఎంతో సపోర్ట్ చేశారు. థాంక్ యు. ఇంత మంచి స్క్రిప్ట్ లో నన్ను భాగం చేసినందుకు సత్యనారాయణ గారికి థాంక్స్. రమేష్ గారు చాలా ఇష్టపడి, కష్టపడి ఈ సినిమా చేశారు. ఈ సినిమాని మీ అందరికీ నచ్చుతుంది అన్నారు.

స్కూల్ కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసే వారి ప్రాణాలు తీసే సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. బెల్లంకొండ శ్రీనివాస్ సైకో కిల్లర్ కేసు ని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. మొత్తానికి సైకో కిల్లర్ ను పట్టుకునే ఇన్వెస్టిగేట్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనుంది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆసక్తిరంగా ఉండటంతో సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ‘ఏ స్టూడియోస్’, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు