‘రష్మికా’తో బ్రేకప్‌ గురించి చెప్పిన హీరో !

‘రష్మికా’తో బ్రేకప్‌ గురించి చెప్పిన హీరో !

Published on Dec 23, 2019 12:08 PM IST

Rashmika Mandanna

క్రేజీ బ్యూటీ రష్మికా మండన్నా కన్నడ హీరో ‘అతడే శ్రీమన్నారాయణ’ ఫేమ్ రక్షిత్‌ శెట్టిని ప్రేమించి ఆ తరువాత విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రష్మికతో బ్రేకప్‌ గురించి రక్షిత్‌ తాజాగా స్పందించాడు. ‘అతడే శ్రీమన్నారాయణ’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడాడు. ‘రష్మికకు చాల పెద్ద కలలు ఉన్నాయని, కెరీర్ పై దృష్టి పెట్టే క్రమంలో మేం విడిపోవాలనుకున్నామని.. కానీ, ఆమె కలలు నిజం కావాలని దేవున్ని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

ఇక ‘అతడే శ్రీమన్నారాయణ’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు. ఈ సినిమాను కన్నడం, తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే కన్నడలో డిసెంబర్‌ 27న, తెలుగులో జనవరి 1న, తమిళ్‌, మాలయాళంలో జనవరి 3న, హిందీలో జనవరి 16న ఈ సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు