ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదని బాధపడిపోతున్న టాప్ హీరోయిన్

Published on May 22, 2019 10:17 am IST

తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలతో జతకట్టారు అందాల భామ రకుల్ ప్రీత్. ప్రస్తుతం ఆమె సీనియర్ హీరో అజయ్ దేవగణ్ తో చేసిన “దే దే ప్యార్ దే” బాలీవుడ్ మూవీ పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రకుల్ తన ఇష్టాయిష్టాలతో పాటు, తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.
బాలీవుడ్ ఖాన్ త్రయం లో ఎవరు తనను ముందు సంప్రదిస్తే వారితో చేస్తాను. అజయ్ దేవగణ్ ఓ ఉన్నతమైన వ్యక్తి అన్నారు. తనకు ఇష్టమైన ప్రదేశం లండన్ అని చెప్పిన రకుల్, రాజమౌళి తో సినిమా చేసే అవకాశం వస్తే టక్కున ఒప్పేసుకుంటుందంట. తన అందం ఆరోగ్యం వెనుక రహస్యం క్రమశిక్షణ, తనపై తనకున్న ప్రేమేనట.

చివరిగా మీకు ఎంతమంది లవ్ ప్రపోజ్ చేసారు అన్న ప్రశ్నకు “ఇంత వరకు ఎవరూ చేయలేదు” అని ముఖం దీనంగా పెట్టి చెప్పింది రకుల్. ఐతే రకుల్ ఈ సమాధానం హాస్యం కొరకు చెప్పింది లే కానీ… అంత అందాల బొమ్మకి ఇంత వరకు ఎవరు ప్రపోజ్ చేయకుండా ఉంటారా…!

సంబంధిత సమాచారం :

More