ఆ స్టార్ హీరో అసలు యాటిట్యూడ్ చూపించడంటున్న రకుల్ ప్రీత్ !
Published on May 17, 2018 8:49 am IST


తమిళ స్టార్ హీరో సూర్య తన 36వ సినిమాను స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘ఎన్.జి.కే’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ చిత్రంలో సూర్యకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవిలు నటిస్తున్నారు. ఈ మధ్యే సూర్యతో కలిసి షూటింగ్లో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ సూర్యపై ప్రశంసల వర్షం కురిపించారు.

సూర్య అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడ ఎలాంటి యాటిట్యూడ్ చూపించరని, సెట్స్ లో సమయానికి ఉంటారని, అందరితోను చాలా ఫ్రీగా మాట్లాడుతుంటారని, ఆయనొక పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అని అన్నారు. డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభులు నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook