ఎన్.టి.ఆర్ డాన్సులకు ఫిధా అయిన రకుల్ ప్రీత్

ఎన్.టి.ఆర్ డాన్సులకు ఫిధా అయిన రకుల్ ప్రీత్

Published on Jul 17, 2015 1:20 PM IST

NTR-rakul-pretty
వరుస హిట్స్ అందుకొని అనతికాలంలోనే స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయిన టాలీవుడ్ లేటెస్ట్ గోల్డెన్ గర్ల్ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ గత కొద్ది రోజులుగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఇటీవలే ఎన్.టి.ఆర్ – రకుల్ ప్రీత్ లపై లండన్ లోని పలు లొకేషన్స్ లో ఓ సాంగ్ ని షూట్ చేయడం స్టార్ట్ చేసారు. నిన్నటితో ఆ సాంగ్ షూట్ ఫినిష్ అయ్యింది. ఈ సాంగ్ షూటింగ్ టైంలో ఎన్.టి.ఆర్ డాన్సులు చూసి రకుల్ ఫుల్ ఫిదా అయిపోయిందట, అందుకే ఎన్.టి.ఆర్ కి ఫుల్ కితాబులిచ్చేస్తోంది ఈ భామ.

‘నేను ఇది వరకు ఒకటి రెండు సార్లు ఎన్.టి.ఆర్ ని కలిసాను కానీ అప్పుడు అంతగా మాట్లాడే టైం లేదు. కానీ ఫస్ట్ టైం సెట్లో ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసాను. ఎన్.టి.ఆర్ చాలా స్పాంటీనియస్ గా రియాక్ట్ అవుతాడు. ఫుల్ సరదాగా ఉంటారు. మామూలుగా ఎన్.టి.ఆర్ సూపర్బ్ డాన్సర్ అని తెలుసు కానీ సెట్లో డాన్సుల్లో ఆయన స్టైల్, పర్ఫెక్షన్ మరియు గ్రేస్ చూసి ఫిదా అయిపోయాను. హి ఈజ్ ఫాబ్యులస్ డాన్సర్’ అని రకుల్ ప్రీత్ అంటోంది. ఈ సాంగ్ హో ఎన్.టి.ఆర్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన రకుల్ ప్రీత్ ఈ రోజు హైదరాబాద్ చేరుకుంటుంది. రేపటి నుంచి రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది.

తాజా వార్తలు