గోల్ఫ్ కి లైఫ్ కి లింక్ పెట్టిన రాకుల్ ప్రీత్ సింగ్

Rakul-Preet

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా విజయంతో పాటు వెంటనే తను నటించిన ‘యారియాన్’ సినిమా కూడా బాలీవుడ్ లో హిట్ అవ్వడంతో రాకుల్ ప్రీత్ సింగ్ కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఆయినే ఈ భామ మోడలింగ్ లోకి అడుగుపెట్టకముందు గోల్ఫ్ ప్లేయర్ అని చెబుతోంది. తన ఫాదర్ ఆర్మీ ఆఫీసర్ అవడం వల్ల టెన్నిస్, బాస్కెట్ బాల్, గోల్ఫ్ లాంటి ఆటల్లో మంచి ప్రావీణ్యం ఉందని చెబుతోంది.

గోల్ఫ్ లో ఎలా నిర్ణయం తీసుకుంటామో లైఫ్ లో కూడా లానే ఉంటుందని ఈ భామ చెబుతోంది. ‘చాలా దూరంలో ఉన్న హోల్ లో బాల్ వేయడం అనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు గోల్ఫ్ లో మిరాకిల్స్ జరుగుతుంటాయి. అలానే లైఫ్ లో కూడా జరగుతాయని’ రాకుల్ చెబుతోంది. ప్రస్తుతం రాకుల్ ప్రీత్ సింగ్ గోపీచంద్, మొజ్ సరసన సినిమాలు చేస్తోంది.

Exit mobile version